నూతన పాలక వర్గానికి ఘన సన్మానం
28-04-2026 03:02 PM
ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని 47వ డివిజన్ రాంనగర్ లోని శ్రీ రామాసహిత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందడి నెలకొంది. స్థానిక కార్పొరేటర్ గాజ రమ-శివరాం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు మరియు కో-ఆప్షన్ సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.






