21 April, 2026 | 5:09 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి

21-04-2026 03:42 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో సామాజిక న్యాయం అమలు చేయాలని డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి దేవీ పోచన్న డిమాండ్ చేశారు. బెల్లంపల్లి సిపిఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన డిహెచ్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు తీసుకొచ్చిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు సామాజిక న్యాయ సూత్రాలను పూర్తిగా ప్రతిబింబించేలా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ప్రత్యేకంగా వాటా కేటాయిస్తూ సామాజిక న్యాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

లేదంటే ఈ బిల్లు తన అసలు లక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే దేశంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్న అన్యాయం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మతం మారిన కారణంగా దళితుల హక్కులను నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్‌కు సంబంధించిన న్యాయ, విధాన పరమైన అడ్డంకులను తొలగించి, సంబంధిత తీర్పులను పునర్ సమీక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, డీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సంద్రంగా ఏప్రిల్ 16,17 తేదీలలో వరంగల్ లో జరిగిన 2వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు పోచన్న,  రాష్ట్ర సమితి సభ్యులుగా మామిడి గోపి,  బొల్లం తిలక్ అంబేద్కర్ ర్లను బెల్లంపల్లి పట్టణ సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు సన్మానించారు. సమావేశంలోఆడెపు రాజమౌళి సీపీఐ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, సీపీఐ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, సీపీఐ మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, నాయకులు గుండా మాణిక్యం, రత్నం రాజన్న, బొంకూరి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.