25 June, 2026 | 3:22 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడదాం

21-04-2026 04:04 PM

మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడదామని అందరం కలిసి ఐక్యంగా అభివృద్ధిలో ముందుకు సాగుదామని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. మంగళవారం స్థానికంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు చైర్మన్ ను సన్మానించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ మేరకు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు మంత్ర రాజ్యం సురేష్ మాట్లాడుతూ స్థానికంగా హిందువుల పండుగలు నిర్వహించే సమయంలో తమకు అన్నివేళలా సహకరించాలని ఆయన కోరారు. దీనికి చైర్మన్ మౌనిక స్పందించి తప్పకుండా సహకరిస్తామని అభివృద్ధిలో మీరందరూ కూడా తమకు సహకరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శెట్టి శ్యామ్మోహన్రావు, కోశాధికారి కరిపే శ్రీనివాస్ ,వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గౌరీకర్ రాజు, బీసీ రమేష్, సాంస్కృతిక కార్యదర్శి తుమ్మనపల్లి లక్ష్మణ్, చింతామణి శ్రీనివాస కృష్ణ, జోగు రాజేశ్వర్, గట్టు రాజేశ్వర్, ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు గుమ్ముల అశోక్, బొప్పారపు సత్యవతి, బండి పల్లి ప్రకాష్, పడాల రాజశేఖర్, సందుపట్ల శ్రావణ్, తోట హనుమంతు రమహాజన్ జితేందర్, ఎస్టిడి రాజేశ్వర్, షికారి లోకేష్, తదితరులు ఉన్నారు.