14 April, 2026 | 5:21 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

పర్యావరణం పాలిట ఫార్మా భూతం

31-10-2025 12:00 AM

పాపని నాగరాజు :

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మా ఇండస్ట్రీకి గొప్ప భవిష్యత్ ఉందని, అది ఆర్థికంగా అభివృద్ధి చెందే భవిష్యత్తుగా పాలకులు, వ్యాపారవేత్తలు, కా ర్పొరేట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఇది ప్రకృతి, పర్యావరణం, మానవ అవషేశాలను ధ్వంసం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ‘ఫార్మా కంపెనీలు’ గ్రామీణ ప్రజలను విషపు చెరువుల్లో ముంచుతోంది. హెటెరో, దివిస్, నాట్కో, రెడ్డీస్ ల్యాబ్స్, ఆప్టిమస్ వంటి మందుల కంపెనీలు వ్యర్థాలతో నదులు, భూగర్భ జలాలు, గాలిని విషపూరితం చేస్తున్నాయి.

పర్యావరణ విధ్వంసాన్ని నిరోధించేందుకు ముందుండి నిలబడాల్సిన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) అవినీతి సంస్థగా మారిపోయింది. విధులు కాగితాలపై.. పని విధానం లంచాల చు ట్టూ తిరుగుతుందన్న విధానంలో టీజీపీసీబీ పని చేస్తుంది. పర్యావరణ విషతు ల్యంపై కిందిస్థాయి అధికారుల చేస్తున్న ఫిర్యాదులను పైస్థాయి అధికారులు ‘బిజినెస్ డీల్స్’గా మార్చుకుంటున్నారు. నెల, సంవత్సరం వారీ లంచాలతో కాలుష్య భూతానికి లంచాల పేరుతో ఎడాపెడా అనుమతులిచ్చేస్తున్నారు.

దీనికి తోడు కంపెనీల యాజమాన్యాలు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు విరాళా ల రూపంలో ఇచ్చే దాతలు కావడం కూ డా దీనికి ఒక కారణం. ఫార్మా కంపెనీలు ఉన్న పరిసర ప్రాంతాల్లో నివసించే వారి లో ఎక్కువగా పేద, దిగువ, మధ్య తరగతివారే ఉంటారు. ఇలా కార్పొరేట్, రాజకీ య ధన దాహం వల్ల పర్యావరణం కలుషితమై అమాయక ప్రజల ప్రాణాలు పో తుండడం శోచనీయం.

టీజీపీసీబీ నిర్లక్ష్యం

టీజీపీసీబీ విధి ఏంటంటే.. పర్యావరణ చట్టాలను అమలు చేయటం, కాలుష్యాన్ని అరికట్టటం. అయితే దీనికి విరుద్ధంగా కా లుష్యకారక పరిశ్రమలపై బోర్డులో కం ప్లుంట్లు ఇచ్చిన వెంటనే ధనార్జనే లక్ష్యంగా సదరు ఫార్మా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కింది స్థాయి అధికారులు విధులను అమలు చేయకుండా, స మస్య తీవ్రత బట్టి ‘కమీషన్’ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు, అక్టోబర్‌లో ఫారెస్ట్ మంత్రి ఓఎస్‌డి సుమంత్‌ను అవినీతి ఆరోపణలతో తొలగించారు.

ఇది అందరికీ కనిపించిన అతిపెద్ద అవినీతి. మ రి ఫార్మా కంపెనీలకు అనుమతులిస్తూ అడ్డగోలుగా పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న టీజీపీసీబీలో జరుగుతున్న అక్రమాలు మాత్రం బయటపడడం లేదు. జనవరి- నుంచి జూలె 2025 వరకు ఏసీబీ 148 అవినీతి కేసులు జిస్టర్ చేయగా.. వీటి లో 93 ట్రాప్ కేసులు, 9 అసమాన  కేసు లు ఉన్నాయి. ధనార్జనే లక్ష్యంగా పెట్టుకోవడంతో పర్యావరణ పరిరక్షణ పట్ల ఉండాల్సిన బాధ్యతలు అధికారులు ము రుస్తున్నారు.

సెప్టెంబర్ 2025లో సెంట్రల్  పీసీబీ తమ రిపోర్ట్‌లో.. హైదరాబాద్‌లోని పరిశ్రమల కంపెనీల్లో  హెవీ మెటల్ కంటా మినేషన్ (దహనం ప్రక్రియ)ను హైలెట్ చేసింది. ఈ ఫార్మా కంపెనీలు వెదజల్లే వ్యర్థాల వల్ల మట్టి, నీరు విషపూరితం అవుతున్నాయి.  2025 మార్చిలో జి. గంగాధ ర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో అక్రమ కార్యకలాపాలు, హెల్త్ హజార్డ్ నుంచి టీజీపీసీబీని తప్పించింది. ఇది వ్య వస్థ లోపంగా పరిగణించాల్సి ఉంటుంది.

అవినీతి దందా

నాట్కో, హెటెరో, రెడ్డీస్, ఆప్టిమస్, దివిస్ వంటి ఫార్మా కంపెనీలు పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. హె టెరో 2025 సెప్టెంబర్‌లో ఎఫ్‌డిఏ ఇన్స్‌పెక్షన్ సందర్భంగా జీఎంపీ డాక్యుమెంట్స్ ను పూర్తిగా నాశనం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది పాల్యూషన్ బోర్డు అవినీతికి నిదర్శనం. జీవనోపాధి, కాలుష్య సమస్యల మధ్య, దివిస్ ల్యాబ్స్ ఫిబ్రవరి 2025లో ఉప్పాడ కోస్ట్ పైప్‌లెన్ పనిని తిరిగి ప్రారంభించింది.

నాట్కో, రెడ్డిలు 2024లో నిబంధనలను ఉల్లఘించినట్లు ఎన్‌జీటీ (జాతీయ హరిత ట్రిబ్యునల్) కేసుల్లో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. మార్చి 2024లో ఈ కంపెనీలు బీఆర్‌ఎస్, సహా ఇతర పార్టీలకు బాండ్స్ రూపంలో విరాళాలు అందిస్తున్నాయి. 2025 అక్టోబర్‌లో లక్షల కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఫార్మా క్రాక్‌డౌన్‌లో బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలపై ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు జరిపింది.

పైకి కెమికల్/ఫార్మా యూనిట్లలో భద్రత ఉన్నట్లు కనిపించినప్పటికీ లోపల మాత్రం నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయనడంలో సందేహం లేదు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఫార్మా కంపెనీలను జనాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ వాటి స్థాన చలనం మాత్రం జరగడం లేదు.

ఇది కార్పొరేట్ సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి సమన్వయంతో పాల్పడుతున్న కుట్రగా అభివర్ణించొచ్చు. ఈ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడంతో పాటు, పొల్యూష్ సర్టిఫికేట్ ఇచ్చే పీసీబీని మచ్చిక చేసుకొని పని కానిస్తున్నాయి.

ప్రమాదంలో మనుగడ

ఏ శాఖలో అయినా పైస్థాయిలో నీతి మంతులుంటే కింద కూడా నీతిమంతులే ఉంటారు. కానీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపిసిబి) మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. జూలె 2025లో పిసిబిలో ఏసీబీ దాడులు నిర్వహించి 22 కేసులు రిజిస్టర్ చేసింది. అంతేకాదు జ్యుడిషియల్ కస్టడీలో పిసిబి సంబంధితులే 20 మంది ఉండడం గమనార్హం. ఇక మే 2025లో సాయి సాగర్ ఇండస్ట్రీస్‌కు పాల్యూషన్ కేసులో హైకోర్టు టిజిపిసిబి ఆర్డర్‌పై స్టే ఇచ్చింది.

పలు రాజకీయ పార్టీలకు చెందిన ఫార్మా కంపెనీలు ఇక్కడ ఉండడమే దీనికి కారణం. సెప్టెంబర్ 2025లో హైదరాబాద్ ఫార్మా పాల్యూషన్ సంక్షోభం మరింత తీవ్రమైంది. హెవీ మెటల్స్, సాల్వెంట్ కంటామినేషన్, వాటర్/సాయిల్/ఎయిర్ పాల్యూషన్‌ను వెదజ ల్లుతున్న పరిశ్రమలను జనావాసా కేంద్రా ల్లో ఏర్పాటు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హెటెరో విషపు వ్యర్థాల మూలంగా గ్రామీణ ప్రజలు క్యాన్సర్, చర్మ వ్యాధులతో బాధపెడుతున్నారు.

పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఫార్మా కంపెనీలను జనావాసాలకు దూరంగా తరలించేలా ప్రభుత్వాల వద్ద డిమాండ్ తేవాలి. ప్రజలు తమ ప్రాణాల కాపాడుకోవడానికి ఉద్యమించకపోతే, మనుగడే ప్ర మాదంలో పడుతుంది. టీజీపీసీబీఅవినీతి, కార్పొరేట్- రాజకీయ లింకుల్లాంటివన్నీ పర్యావరణ విధ్వంసానికి మూల కారణాలవుతున్నాయి.

పర్యావరణానికి హాని కలి గిస్తున్న హెటిరో, దివిస్ సహా ఇతర ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవడంతో పాటు పర్యావరణానికి అండగా నిలబడాల్సిన పీసీబీలో తక్షణమేఊ సంస్కరణలను తీసుకొచ్చి ప్రజావసరాల కేంద్రంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

వ్యాసకర్త సెల్: 994887290