ఫేస్‌బుక్‌లో ప్రేమ,పెళ్లి పేరుతో నమ్మించి రూ.7.50 లక్షలతో పరార్
సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో పరిచయం ఆపై పెళ్లి
దివ్యాంగ అడ్వకేట్‌ను నమ్మించి నట్టేట ముంచిన సోషల్ మీడియా పరిచయం
హుజూర్ నగర్, ఆగస్టు 4: సోషల్ మీడియాలో పరిచయం...ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ప్రేమ పేరుతో ఇద్దరు ఒకటే పెళ్లి చేసుకున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి నట్టేట ముంచి ఆమె డబ్బుతో పరారయ్యాడు. సోషల్ మీడియా పరిచయాలు మరోసారి ప్రమాదకరంగా మారిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో వెలుగు చూసింది. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి ప్రేమ,పెళ్లి పేరుతో నమ్మించి రూ.7.50 లక్షలు కాజేసి పరారైనట్లు ఓ దివ్యాంగ మహిళా అడ్వకేట్ ఆరోపించారు.
నిందితుడి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హుజూర్ నగర్ పోలీస్ స్టేష న్ ఎదుట బాధితురాలు కుటుంబ సభ్యులతో నిరసన చేపట్టింది. హుజూర్నగర్కు చెం దిన దివ్యాంగ అడ్వకేట్ షేక్ మౌలాబీకి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన షేక్ కరీముల్లా, తండ్రి మస్తాన్ వలీ ఫేస్బుక్ ద్వారా పరిచయమ య్యాడు.తాను జీవితాంతం అండగా ఉంటానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు దగ్గరైనట్లు బాధితురాలు తెలిపింది.
ఆ నమ్మకంతో ఇద్దరూ వివాహం చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం న్యాయవాద వృత్తిలో సంపాదించిన రూ.7.50 లక్షల నగదును వ్యాపార అ వసరాల పేరుతో తీసుకున్న కరీముల్లా అ నంతరం పరారైనట్లు బాధితురాలు ఆరోపించారు. పలుమార్లు సంప్రదించినా స్పందిం చకపోవడంతో పోలీసులనుఆశ్రయించినట్లు తెలిపారు.తల్లిదండ్రులు లేని, అంగవైకల్యంతోనూ స్వయం కృషితో న్యాయవాదిగా ఎదిగిన మహిళను ప్రేమ,పెళ్లి పేరుతో మోసం చేయడం అత్యంత దారుణమని న్యాయవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితుడైన షేక్ కరీముల్లాపై చట్టపరమైన చర్య లు తీసుకుని,తన రూ.7.50 లక్షలు తిరిగి ఇ ప్పించాలని బాధితురాలు పోలీసులను కో రారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని బార్ అసోసి యేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ చలి కంటి నరేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జక్కుల వీరయ్య, నగేష్ రాథోడ్,సైదా హుస్సేన్, పిడమర్తి చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.






