14 May, 2026 | 5:47 PM

సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలి

14-05-2026 04:37 PM

జిల్లా ఎస్పీ నితిక పంత్ 

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తులు, వర్గాలను కించపరిచే పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు, తప్పుడు ప్రచారాలు, అసభ్యకర వీడియోలు షేర్ చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలు సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తాయని తెలిపారు. సైబర్ నేరాల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసభ్యకర లేదా విద్వేషపూరిత పోస్టులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.