14 May, 2026 | 5:36 PM

కోటి 72 లక్షలతో కేజీబీవీ పాఠశాల మరమ్మతులు

14-05-2026 04:35 PM

లక్ష్యంతో చదవండి. ఉన్నదులుగా ఎదగండి .ఎమ్మెల్యే.

బోథ్,(విజయక్రాంతి): విద్యార్థు లు లక్ష్యంతో చదివి ఉన్నతులుగా ఎదగాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) పేర్కొన్నారు. గురువారం నేరగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో అభివృద్ధి పనుల కోసం ఒక కోటి 72 లక్షల రూపాయల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించడం జరిగిందన్నారు.అయితే విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నతులుగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలో నివాసతులను పరిశీలించడంతోపాటు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు