calender_icon.png 1 July, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషియో ఫాంటసీ.. దీర్ఘాయుష్మాన్ భవ

29-06-2025 12:00:00 AM

రొటీన్ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా సోషియో ఫాంటసీ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’. కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరోహీరోయిన్లు. ఎం పూర్ణానంద్ దర్శకత్వంలో ఈ సినిమాను త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మిస్తు న్నారు.

ఆమని, నాగినీడు, కాశీవిశ్వనాధ్, పృథ్వీ రాజ్, సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేశ్; జెమిని సురేశ్, నోయల్, గుండు సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న.

ఈ చిత్రాన్ని జులై 11న విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాకు సంగీతం: వినోద్ యాజమాన్య; ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోష్; ఎడిటింగ్: కిషోర్ మద్దాలి; నిర్మాత: వంకాయలపాటి మురళీకృష్ణ; దర్శకత్వం: ఎం పూర్ణానంద్.