సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
శేరిలింగంపల్లి, మే 12 (విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ మైత్రీనగర్ ఫేజ్--2లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హరిపాక మాధురి (35) ఒంటరి తనం, మానసిక ఒత్తిడికిలోనై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక బ్రహ్మ, చిన్న అమ్ములు కూతురు. 12 ఏళ్ల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది.
వారికి ఒక కుమారుడు ఉన్నాడు. గత ఆరు నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. ఐదు రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనవడిని తీసుకొని స్వగ్రామా నికి వెళ్లారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. అయితే సోమవారం ఉదయం నుంచి బయటికి రాకపోవడంతో అనుమానించి తలుపులు తెరిచి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచా రం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మ హత్యకు సంబంధించి వివరాలు దొరకలేదని, విడాకుల తర్వాత ఒంటరితనం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా మాధురి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమాని స్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






