calender_icon.png 11 September, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి వచ్చిన సీసీ రోడ్డు సమస్యకు పరిష్కారం

11-09-2025 05:27:12 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి తండాలో సీసీ రోడ్డు సమస్య గురించి ప్రజావాణిలో వచ్చిన పిర్యాదు మేరకు గురువారం తండాకు బాన్సువాడ డిఎల్ పీఓ వెంకట సత్యనారాయణ రెడ్డి, పెద్ద కొడప్ గల్ ఎంపిడీవో లక్ష్మీ కాంత్ రెడ్డి,లు విచారణకు వచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో విచారణ జరిపి ఇరువర్గాలను సయోధ్య కుదిర్చి మెప్పించి అసంపూర్ణంగా ఉన్న సీసీ రోడ్డు ను పూర్తి చేయడానికి స్థలం ఇచ్చుటకు ఒప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిర్దావర్ చండూరి అంజయ్య, డీఎల్ పీఓ అసిస్టెంట్ జ్యోతిరాజ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్, నాగి రెడ్డి, శ్యామప్ప పటేల్, మల్లప్ప పటేల్,డాక్టర్ సంజీవ్, గొండా విఠల్,ప్రహ్లాద్ పటేల్, మాశ్నాజీ, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రమితి బాయి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బన్సీ,తండా నాయకులు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.