calender_icon.png 11 September, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ హిందీ ఉపాధ్యాయులకు సన్మానం

11-09-2025 05:24:45 PM

హనుమకొండ (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాల, లష్కర్ బజార్ లో గురువారం జరిగిన హిందీ ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ హిందీ అధ్యాపకులుగా అవార్డు పొందిన వారిని హిందీ సేవా సమితి(Hindi Seva Samiti) పక్షాన ఘనంగా సత్కరించారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన అజీముద్దీన్, శ్రీమతి చిత్రలేఖను, జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గౌస్ పాషాను, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన రాములును హిందీ సేవా సమితి పక్షాన ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు జగన్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు, హిందీ డి.ఆర్.పి ఎఫ్.ఎస్.అలీ, హిందీ సేవా సమితి అధ్యక్షులు ఆర్. లక్ష్మణ్ సుధాకర్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ తిరుపతయ్య, మూడు మండలాల హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.