calender_icon.png 11 September, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

11-09-2025 05:30:36 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గురువారం 10వ డివిజన్ కాపువాడ, 11వ డివిజన్ లలో 60 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddyశంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, ప్రాధాన్యత పరంగా అన్ని డివిజన్ లలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. శంకుస్థాపన చేసిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంతిన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, దేవరకొండ విజయ సురేందర్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, డివిజన్ ల అధ్యక్షులు కుమార్ యాదవ్, సంగీత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.