విద్యు త్ తీగల సమస్యకు పరిష్కారం
02-09-2026 | 02:56pm
బోథ్. సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): సోనాల మండల కేంద్రంలోని అరవవార్డులో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తు తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. దీంతో అవార్డులో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళన గురవుతూ వస్తున్నారు. పలుమార్లు విద్యుత్తు తీగలు తెగిపడడంతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. సమస్యను గ్రామ సర్పంచ్ యాల్ల బిందు జాబు వివరించడంతో విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో బుధవారం విద్యుత్ శాఖ ఏఈ రాజు ఎల్ఐ లక్ష్మణ్ లైన్మెన్ ప్రణీతులు విద్యుత్ తీగలను సరి చేశారు.






