2 September, 2026 | 4:22 PM

వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

02-09-2026 | 03:06pm

జడ్చర్ల(విజయక్రాంతి) : స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Y.S. Rajasekhara Reddy) వర్ధంతిని పురస్కరించుకుని జడ్చర్ల మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.