1 July, 2026 | 9:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

గ్రీన్ ల్యాండ్ లెక్క తేల్చండి!

10-06-2025 12:20 AM

మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే అల్టిమేటమ్ 

మహబూబాబాద్, జూన్ 9 (విజయ క్రాంతి): మహబూబాబాద్ పట్టణంలో గత ప్రభుత్వంలో గ్రీన్ లాండ్, ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన విషయంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అధికారులకు అల్టిమేటమ్ జారీ చేశారు.

ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకోవడం, వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు అనుమతులు ఇవ్వడం, ఉదాసీనంగా వ్యవహరించడం సరైనది కాదని, వెంటనే ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.