సోమయ్య అకాల మృతి పార్టీకి తీరని లోటు
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఆగస్టు28: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కోడూరు గ్రామ సర్పంచ్ వల్లపు అవిలమ్మ భర్త వల్లపు సోమయ్య అకాల మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని భువనగిరి పార్లమెంటు సభ్యులు,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా, పబ్లిక్ కమ్యూనికేషన్ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోడూరు గ్రామంలో సోమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను ఓదార్చి మాట్లాడారు.
నివాళులర్పించిన వారిలో తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సామ అభిషేక్ రెడ్డి,డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి,నాయకులు దాసరి సోమయ్య,పాలెల్లి సురేష్, జలెంధర్, మనోహర్, వెంకటేశ్వర్లు, కిరణ్, వేణుగోపాల్, నరేష్, కోటిప్రసాద్, మాధవ్ తదితరులు ఉన్నారు.






