కొన్ని జ్ఞాపకాలకు భద్రత వుండదు!
06-07-2026 12:00 AM
స్వేచ్ఛలేనిచోట బానిసగా బతికే బదులు
జీవితమంతా తప్పిపోయి తిరగడం మంచిది
ఈ లోకం మనసునిండా ప్రేమించదు
అవసరముంటేనే పలకరిస్తుంది
కొన్ని జ్ఞాపకాలకు భద్రత వుండదు
అవి సముద్రాల నుంచి తప్పించుకొని, కన్నీళ్లయి రాలుతాయి
ప్రశ్నించడాయికి సమయం కోసం చూడొద్దు
హింసను భరించేది నీవు, గడియారం కాదు
కష్టాలలో గుండె పగిలిపోదు,
మనసు చెదిరిపోదు
మనిషి ఓడిపోతాడు ఒకసారి పరిస్థితులతో
ఒకసారి కాలానితో
ఒకసారి తనతో తానే గెలవలేకపోతాడు
జీవించడం వదిలేయడు
ఒక్కొక్కప్పుడు, మనిషి అలసిపోయినా
కలల దీపం పట్టుకొని బయలుదేరుతాయి
అద్దం పగిలిపోయి, ఎన్ని ముక్కలైనా
అన్నిటిలో నిండు చందమామనే కనిపిస్తుంది
ఆశారాజు






