9 May, 2026 | 9:15 PM

Breaking News

మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •   లాడ్జి యజమానులకు పోలీసుల అవగాహన సదస్సు: ఎస్పీ రోహిత్ రాజ   •  

కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం అత్తమామలపై అల్లుళ్ల దాడి

09-05-2026 08:41 PM

- ముగ్గురికి తీవ్ర గాయాలు..  పోలీసుల అదుపులో  నిందితులు

గజ్వేల్: సిద్దిపేట జిల్లా దిలాల్‌పూర్ గ్రామంలో అదనపు కట్నం, కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఇద్దరు అల్లుళ్లు కలిసి అత్త, మామ, భార్యపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రాచకొండ నర్సింలు, నాగమణి దంపతులు తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తె లలితను వడ్డేపల్లి గ్రామానికి చెందిన శ్యాం కుమార్‌కు, చిన్న కుమార్తె అనితను వేములఘాట్ గ్రామానికి చెందిన అరుణ్‌కు

 ఇచ్చి వివాహం చేశారు. లలిత భర్త శ్యాం కుమార్ కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్యను, అత్తమామలను వేధిస్తున్నాడని లలిత ఆరోపించింది. అలాగే అరుణ్ కళ్యాణ లక్ష్మి చెక్కు డబ్బుల కోసం అత్తమామలను వేధిస్తున్నాడని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో శ్యాం కుమార్, అరుణ్ ఇద్దరూ పథకం ప్రకారం నర్సింలు, నాగమణి, లలితలపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, గ్రామస్తులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు శ్యాం కుమార్, అరుణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.