09-12-2025 08:32:07 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ చర్చి జంక్షన్ లోని ఓయాసిస్ బాలుర ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు రాష్ట్ర ఫిషర్మెన్ కమిటీ సభ్యులు మండల సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలోని బాలులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు తాళ్ల పెళ్లి రవీందర్ (జె.కె), తాళ్లపల్లి విజయ్, జనగాం శ్రీనివాస్ గౌడ్, నల్ల ఆశీర్వాదం, తాళ్ల పెళ్లి రమేష్, తాళ్లపల్లి రాజకుమార్, ఒయాసిస్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు ముద్ది రాజ్ చంద్ర ప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.