09-12-2025 08:30:19 PM
తుపాకుల ప్రియాంక సర్పంచ్ అభ్యర్థి..
మఠంపల్లి: కన్నతల్లి లాంటి ఊరు ఋణం తీర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి తుపాకుల ప్రియాంక అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు పిండిప్రోలు రామచంద్రయ్య ఆధ్వర్యంలో గ్రామంలో విస్కృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో మీ ముందుకు వచ్చానని గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా నిస్వార్ధంగా పనిచేస్తానన్నారు. ఇట్టి కార్యక్రమంలో మహిళలు యువకులు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు.