తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ...
ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని మాజీ మంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్ర రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం కేక్ కట్ చేసి, ఒకరికొకరు కేక్ తినిపించుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకి దక్కిందని, ఏళ్లుగా నలుగుతున్న ప్రత్యేక తెలంగాణ సమస్యను తీర్చి తెలంగాణ తల్లిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన సోనియా గాంధీకి మరొకమారు ధన్యవాదాలు తెలిపారు. నాయకులు అంబకంటి అశోక్, సంజయ్ దుబే, మోతిరామ్, వసీముద్దీన్, మృత్యుజ, మహమ్మద్ నాహిద్, సుగత్, అశోక్, ప్రవీణ్, వసీం రంజాని, రఘు వంశీ, రవీందర్, రాజేశ్వర్, మెస్రం సుభాష్, కవిత, గంగమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.






