26 April, 2026 | 11:34 AM

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి...

09-12-2024 05:25 PM

అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు...

వనపర్తి (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జెడ్పి సీఈవో యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 41 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.