12 May, 2026 | 9:42 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

టాలీవుడ్‌లోకి సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

24-02-2025 11:35 AM

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు మరో నూతన నిర్మాణ సంస్థ భారీఎత్తున సినిమాలను నిర్మించటానికి సిద్దమవుతోంది. సోనుధి ప్రొడక్షన్‌ నంబర్‌ 1 పేరుతో మార్చి 2 వ తేది 11.20 గంటలకు ఆదివారం తమ మొదటి సినిమాను ప్రారంభిస్తున్నామని తెలియచేశారు. ఈ సందర్భంగా సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ అధినేత ప్రముఖ వ్యాపారస్థులు, రాజకీయ నాయకులు ఆర్‌.యు రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సోనుధి అంటే లక్ష్మీనరసింహ స్వామి సహస్ర నామంలోని ఒక నామం పేరు సోనుధి. మా మొదటి ప్రయత్నంగా యంగ్‌ టాలెంటెడ్‌  దర్శకులు కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్యల ద్వయాన్ని దర్శకులుగా మా బ్యానర్‌ నుంచి పరిచయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. 2025లో అనేక సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. చిత్ర ప్రారంభంరోజున నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు తెలియచేస్తాం’’ అన్నారు.