9 April, 2026 | 10:45 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

సౌతాఫ్రికా శుభారంభం

10-02-2026 02:05 AM

కెనడాపై ఘనవిజయం

అహ్మదాబాద్, ఫిబ్రవరి 9 : టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కెనడాపై 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. కెప్టెన్ మాక్‌ర్రమ్(59)హాఫ్ సెంచరీతో రాణించగా..డికాక్ (25),రికెల్టన్(33) మెరుపులు మెరిపించారు.

చివర్లో డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లోనే 1 ఫోర్ 3 సిక్సర్లతో 39 , స్టబ్స్ 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో34 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్యఛేదనలో కెనడా ఆరంభంలోనే చేతులెత్తేసింది. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి దెబ్బకు కెనడా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు,  చివరికి ఇటలీ 8 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. లుంగి ఎంగిడి 4/31, మార్కో యెన్సన్ 2 వికెట్లు పడగొట్టారు.