2 June, 2026 | 10:03 PM

బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

02-06-2026 09:32 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన లోకుర్తి నిశాంత్, కమల కుటుంబ సభ్యులను, అలాగే వడదెబ్బ కారణంగా మృతి చెందిన షేక్ హైదర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం పరామర్శించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యుల ఆవేదనను తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,స్థానిక సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు మనుక సత్యం,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.