2 June, 2026 | 10:08 PM

శివంపేట మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!!

02-06-2026 09:36 PM

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండలంలోని వివిధ గ్రామాలలో తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయ వద్ద సంబంధిత అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మార్వో కమలాద్రి చారి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ బుచ్చా బుచ్చ నాయక్, శాఖ గ్రంధాలయం వద్ద గ్రంథ పాలకురాలు అర్చన, ఇతర ప్రభుత్వ కార్యాలయం వద్ద సంబంధిత అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. శివంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్, ఉప సర్పంచ్ ఇసుగారి మల్లేశం, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ కార్యదర్శి రమాదేవి సమక్షంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం కల సహకారమైందని అన్నారు.