2 June, 2026 | 10:37 PM

ఎందరో మహానుభావుల బలిదానాల త్యాగ ఫలం

02-06-2026 09:34 PM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం- మేయర్ మూడ్ గణేష్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం నగర పాలవిక సంస్థలో మేయర్ మూడ్ గణేష్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక ఘనంగా నిర్వహించారు. మేయర్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వారు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లకు, కార్యాలయ సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తరువాత వారు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో మహానుభావులు, విద్యార్థి నాయకులు పోరాటాలు చేయడంతో పాటు, ఆత్మ బలిదానాలు చేశారని, అంతటి త్యాగాలతో సిద్దించిన తెలంగాణ రాష్ట్రంలో ఆ అమరవీరులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని, వారి ఆశయ సాధన దిశగా మనం అడుగులు వేయాలని అన్నారు. నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ ను తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్ ల కంటే ముందంజలో ఉండే విధంగా నిరంతరం కృషి చేస్తానని, అందుకు కార్పొరేషన్ అధికారులందరు నిబద్ధతతో పని చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుజాత గారు గారు, కార్పొరేటర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.