calender_icon.png 4 September, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ స్థాయి జెడ్‌ఆర్‌యూసీసీ సమావేశం

04-09-2025 09:55:26 AM

హైదరాబాద్: తేదీ 3.9.2025 రోజున సౌత్ సెంట్రల్ రైల్వే వారు జోనల్ స్థాయి ZRUCC సమావేశం సికింద్రాబాద్ రైల్ భవన్ లో నిర్వహించారు. ఇట్టి సమావేశానికి నిజామాబాదు సభ్యులైన రావులపల్లి జగదీశ్వర్ రావు హాజరైనారు. జనరేక్ మేనేజర్ గారైన సంజయకుమార్ శ్రీవాస్తవ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాముఖ్యతను, వారు చేస్తున్న కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యాలు తెలుపుతూ సభ్యులను మరిన్ని సేవ సౌకర్యల గురించి తగు సూచనలు కోరారు.

నిజామాబాదు తరపున జగదీశ్వర్ రావు ఒక సమగ్ర వినతి పత్రాన్ని 9 డిమాండ్లతో సమర్పించారు. పగటిపూట సికింద్రాబాద్, ముంబై వైపుకు ట్రైన్ సదుపాయం కల్పించాలని, నాందేడ్ వరకు వస్తున్న వందేబారత్ ను నిజామాబాదు వరకు పొడిగించాలని, తిరుపతికి వందేబారత్ సౌకర్యం కల్పించాలని, ఆర్మూర్ డిచిపల్లి మధ్య ట్రాక్ లింక్ కల్పించి రైల్వే బైపాస్ నివారించి భూసేకరణలోని ప్లాట్స్ యజమానులను రక్షించాలని, తపోవన్ ఎక్సప్రెస్, హైకోర్టు ఎక్సప్రెస్, pune, ముంబై ఎక్సప్రెస్, బెంగుళూరు, ఢిల్లీ ట్రైన్లను ధర్మాబాద్, నాందేడ్ లనుండి నిజామాబాదు వరకు పొడిగించాలని, ట్రాఫిక్ కు అనుకూలంగా ముంబై సికింద్రాబాడు కు మరొక రైలు అడపాలని, గూడ్స్ షెడ్ మరొకచోటుకి తరలించాలని, నిజామాబాదు స్టేషన్ను లిఫ్ట్, సీసీ కెమెరాలు, స్కానింగ్, ప్రయాణికుల వసతులు తదితర సకల సౌకర్యాలతో త్వరగా అందుబాటులోకి తేవాలని, ప్రయాణికుల భద్రతా చర్యలు తీసుకోవాలని జగదీశ్వర్ రావు కోరారు. జనరల్ మేనేజర్ వాటిని సానుకూలంగా విని వాటిని పరిష్కరిస్తామని  zrucc కి హామీ ఇచ్చారు. మూడ్ఖేడ్ నుండి త్వరితగటిలో జరుగుతున్న డబ్లింగ్ పనులు మరియు ROB పనులు పూర్తయితే మరిన్ని రైళ్లు, సౌకర్యాలు నిజామాబాదుకి వస్తాయని శ్రీవాస్తవ గారు తెలిపారు.. సమావేశం ఉన్నత స్థాయిలో, అనుకూలంగా సామరస్యంగా జరిగిందని జగదీశ్వర్ రావు తెలిపారు..