04-09-2025 12:19:49 PM
స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి
నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): నల్లగొండ పట్టణం దుప్పలపల్లి రోడ్డులో(Duppalapally Road) గురువారం ఘోర విషాదం చోటుచేసుకుంది.తోరగల్ గ్రామానికి చెందిన ఓ చిన్నారి స్కూల్‌కు వెళ్తుండగా ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి మృత్యువాత పడింది. బస్సు కింద చిక్కుకున్న చిన్నారిని స్థానికులు ప్రాణాపాయ స్థితిలోనుంచి బయటకు తీశారు. కానీ అప్పటికే ఊపిరి ఆగిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి(Rajasekhar Reddy) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమన్నీరై విలపిస్తున్నారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో తొరగల్లు గ్రామం మొత్తం విషాద ఛాయల్లో మునిగిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.