calender_icon.png 4 September, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులులో ఘోర రోడ్డుప్రమాదం

04-09-2025 12:41:05 PM

అక్కడికక్కడే ముగ్గురు మృతి.. 

వర్ని మండలంకు చెందిన ఇద్దరు, బోధన్ కు చెందిన ఒకరు మృతి..

బాన్సువాడ,(విజయక్రాంతి): దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన తెలంగాణ, మహారాష్ట్ర(Maharashtra Telangana border) సరిహద్దులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే మహారాష్ట్రలోని బాలాజీ గణేష్ మందిరానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తరోడ్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దులో ప్రమాదం చోటుచేసుకుంది.

బుధవారం రాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు, బోధన్  మండలం బెల్లాల్ కు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం రాత్రి  ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టగా కారులో ఉన్న చేకూరి బుల్లి రాజు (50), అతని భార్య సునీత (45), వాణి (38) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గున్నం చంద్రశేఖర్ (35 ), నీలిమ (45)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను  నిజామాబాద్, బైంసా ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.