calender_icon.png 4 September, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో మరణించిన డోలి కృష్ణమూర్తి నేత్రాలు దానం

04-09-2025 12:22:01 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం లోని హనుమాన్ బస్తీకి చెందిన డోలి కృష్ణమూర్తి(Doli Krishnamurthy) గురువారం అనారోగ్యంతో మరణించారు. జనహిత సభ్యులు డోలి సుకుమార్ వారి కుటుంబ సభ్యులను నేత్రదానం కోసం అంగీకరించేలా చేశారు. దీంతో ముడుతో నీ భార్య డోలి పుష్ప, కుమారులు డోలి నాగేంద్ర ప్రసాద్, డోలి సాయి కృష్ణ తన తండ్రి నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. వారి కుటుంబ సభ్యులైన డోలి సుదీర్ పర్యవేక్షణలో సదాశియా ఫౌండేషన్ సహకారంతో వాసన్ ఐ బ్యాంక్ సిబ్బంది నేత్రలను స్వీకరించారు. నేత్రదానం చేసిన డోలి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులకు జనత సేవా సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.