04-09-2025 12:35:52 PM
ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల సందడి
రేపట్నుంచి ఖైరతాబాద్ గణష్ దర్శనానికి నిరాకరణ
భక్తుల రద్దీ.. వీఐపీ దర్శనాలు నిలిపివేత
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం(Khairatabad Ganesh Darshan) నేటితో ముగియనుంది. రేపట్నుంచి మహాగణపతి దర్శనానికి అనుమతి నిరాకరించనున్నారు. చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల సందడి నెలకొంది. ఖైరతాబాద్ గణనాథుడి(Khairatabad Ganesh) దర్శనానికి క్యూలైన్లలో భక్తులు కిక్కిరిశారు. మండపం తొలగించేందుకు త్వరలో నిర్వాహకులు దర్శనం నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. భక్తుల రద్దీ పెరగడంతో వీఐపీ దర్శనాలు నిలిపివేశారు.