04-09-2025 12:05:28 PM
సీఎం డైరెక్షన్ లో కవిత ఉన్నారు..
హైదరాబాద్: కవితను బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పద్మా దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) అన్నారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో హరీశ్ రావు కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారని ఆమె సూచించారు. రేవంత్ రెడ్డి కాళ్లను హరీశ్ రావు మొక్కారనడం బాధ కలిగించిందని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. హరీశ్ రావు(Harish Rao) గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేంది లేదని హెచ్చరించారు. కవిత రౌడ్ టేబుల్ భేటీ పెట్టినా పార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత ఉన్నారని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుమారైగా కవిత గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని చెప్పారు. కవిత తనక తాను గొయ్యి తవ్వుకున్నారని తెలిపారు. కాగా, తన బంధువు హరీష్ రావుతో సహా సీనియర్ నాయకులపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఒక రోజు తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బుధవారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను స్పీకర్‌కు అందజేశారు.