04-09-2025 11:48:03 AM
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో(Nalgonda) గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి ఎల్ కేజీ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని దేవరకొండ రోడ్డులో జరిగింది. మృతి చెందిన నాలుగేళ్ల బాలికను జస్మితగా గుర్తించారు. పాఠశాల ఆవరణలో బస్సు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తీసుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు బాలిక చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న బాలిక మృతితో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.