12 April, 2026 | 9:17 PM

హోంగార్డ్ కుమారుడికి ఎస్పీ అభినందన

28-06-2024 04:48 AM

సంగారెడ్డి, జూన్ 27 (విజయక్రాంతి): మహారాష్ట్రలోని పుణెలో గత నెలలో జరిగిన ఆల్ ఇండియా కిక్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో 27 రాష్ట్రాలకు చెందిన బాక్సర్లు పోటీపడగా.. సంగారెడ్డికి చెందిన పోలీసు హోంగార్డ్ ముత్యం కుమారుడు రఘువంశీ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా గురువారం ఎస్పీ చెన్నూర్ రూపేష్ తన కార్యాలయంలో రఘువంశీని అభినందించి, టోర్నమెంట్‌లో మొదటి బహుమతి సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.