కర్రె గుట్టలను సందర్శించిన ఎస్పీ కేకన్
ములుగు (మహబూబాబాద్) మే 21 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ గురువారం పోలీస్ అధికారులతో కలిసి వెంకటాపురం మండల పరిధిలోని కర్రె గుట్టలను సందర్శించారు. ఈ సందర్భంగా మురుమూరు నుండి పామునూరు, జల్ల, డోలీ మీదుగా తాడపాల వరకు నిర్మాణంలో ఉన్న రహదారి పనులను పరిశీలించారు. రహదారి నిర్మాణ పను లను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా పాటించాలని సంబంధిత కాంట్రా క్టర్కు ఆదేశించారు.
రహదారి నిర్మాణ పను ల నిమిత్తం రాత్రింబవళ్లు కష్టపడి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో ఎస్పీ మాట్లాడి, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏ ఎస్ పి మనన్ భట్ ఐపీఎస్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేష్, వెంకటాపురం ఎస్‌ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.






