గిరి దర్శక్ పర్యాటక గైడ్లకు శిక్షణ
మొబైల్ మ్యూజియం ప్రారంభించిన ఎస్పీ
ములుగు (మహబూబాబాద్) మే 15 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్న తెలంగాణ పర్యాటక శాఖ, ములుగు జిల్లాలో గిరి దర్శక్ పర్యాటక గైడ్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది.
కర్రిగుట్టల ప్రాంతంలోని పర్యాటక కేంద్రాల్లో గైడ్లుగా సేవలందించేందుకు ఎంపికైన యువతకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఏస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ ప్రారంబించారు. ఈ సందర్బంగా ఏస్పీ మాట్లడుతూ ములుగు జిల్లాలో రామప్ప, మేడారం, లక్నవరం, మల్లూరు, బోగత జలపాతం లాంటి పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు వాటి ప్రాముఖ్యతను వివరించి రాష్ట్రంలో ములుగు జిల్లాను పర్యాటక రంగంలో ముందుంచడానికి గైడ్లు కృషి చేయాలని, పర్యాటకులకు సేవలను అందించి వారి మన్నలను పొందాలన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాలు, వాటి చారిత్రక ప్రాధాన్యం, పర్యాటకులకు అందించాల్సిన సమాచారం, పర్యాటకుల పట్ల గైడ్లు అనుసరించాల్సిన విధానాలపై ఉమ్మడి జిల్లా పర్యాటక అధికారి శివాజీ, రామప్ప టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ అవగాహన కల్పించారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను పర్యాటకులకు సమర్థంగా వివరించే విధంగా వారికి మార్గదర్శనం చేశారు.
పర్యాటక సమాచార మొబైల్ మ్యూజియం ఆద్బుతం
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ మ్యూజియాన్ని ములుగు జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ములుగు ఎస్పీ కార్యలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ మ్యూజియంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు, ప్రత్యేక ఆకర్షణలు, పర్యాటక విశేషాలు ప్రదర్శనకు ఉంచగా ఎస్పి ప్రారంబించారు, ఈ సందర్బంగా ఎస్పి మ్యుజియం సందర్శించిన అనంతరం మాట్లాడుతూ మైబైల్ మ్యుజియం అద్భుతంగా ఉందని, రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమచారం అద్భుతంగా ఉందని కోనియాడారు.
పర్యాటకులకు అవసరమైన బ్రోచర్లు, సమాచార పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ మొబైల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. శివాజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనన్ భట్, డిఎస్పీ రవీందర్, డిపిఆర్‌ఓ రఫీక్, డిటివో శివాజీ, గైడ్ విజయ్ కుమార్, టూరీస్ట్ పోలీస్లు అరుణ్, శ్రీకాంత్, టూరిజం సిబ్బంది అనంద్ పాల్గొన్నారు.






