శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్
నూతన పరిశోధనలు చేయాలి - ఆచార్య ఉమేశ్ కుమార్
ముకరంపుర, మే 15(విజయ క్రాంతి)కృత్రిమ మేధస్సు ఆధారిత ఆర్థిక ప్రణాళిక దృశ్యీకరణ కంప్యూటర్ టెర్మినల్‌అనే అంశానికి గాను కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్ ,ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ యూనైటెడ్ కింగ్డమ్ (లండన్) వారు పేటెంట్ ను అందజేశారు. ఈ వినూత్న టెర్మినల్ ద్వారా వ్యక్తిగత, వ్యాపార, సంస్థాగత ఆర్థిక ప్రణాళికలను కృత్రిమ మేధ సహాయంతో దృశ్య రూపంలో విశ్లేషించుకోవచ్చు.ఈ వ్యవస్థలో వినియోగదారు లు తమ ఆదాయం, ఖర్చులు, పొదుపులు, పెట్టుబడులు, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను గ్రాఫ్లు, చార్టులు, అత్యాధునిక దృశ్య రూపంలో సులభంగా పరిశీలించవచ్చు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ శ్రీవాణి కి అభినందనలు తెలియజేస్తూ అధ్యాపకులు నాణ్యమైన పరిశోధన లు చేస్తూ, నూతన పేటంట్స్ ను రిజిస్టర్ చేయాలనీ, విశ్వవిద్యాలయాన్ని పరిశోదనలలో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. డాక్టర్ కే శ్రీవాణి ప్రస్తుతం అర్థశాస్త్ర విభాగపు అధిపతిగా, అదనపు పరీక్షల నియం త్రణ అధికారిగా ( కాన్ఫిడెన్షియల్ )విధులు నిర్వర్తిస్తున్నారు.
శ్రీవాణి పలు జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పరిశోధన పత్రాలను, వివిధ ఆర్థిక అంశాలపై అనేక పుస్తకాలను ప్రచురించి, మూడు జాతీయస్థాయి సెమినార్లను, ఒక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో సుకన్య సమృద్ధి యోజన పథకం పనితీరుపై ఒక స్వల్పకాలిక ప్రాజెక్టును పూర్తి చేశారు. తన మార్గదర్శకత్వంలో నలుగురు పరిశోధక విద్యార్థులు పిహెచ్డి పూర్తి చేశారు.






