calender_icon.png 17 July, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

17-07-2025 12:45:36 AM

భైంసా, జూలై ౧౬ (విజయక్రాంతి): భైం సా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో  ఎస్పీ డా.జి. జానకి షర్మిల బుధవారం పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.  సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచిం చారు.

సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వచ్చిన కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, ఇంకా పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పెండింగ్ లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు.