calender_icon.png 17 July, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

17-07-2025 12:45:12 AM

జ‌హీరాబాద్ రూర‌ల్ ఎస్సై కాశీనాథ్

జహీరాబాద్: ప్రతి వ్యక్తి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్ అన్నారు. బుధవారం జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై కాశీనాథ్ మాట్లాడుతూ... సైబర్ నేరాల గురించి తెలుసుకోవాలని, విద్యతోపాటు సమాజంలో జరుగుతున్న సమస్యలను గుర్తెరిగి చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మ్యారేజ్ యాక్ట్, విద్య హక్కు చట్టం, బాల్య వివాహాలు, ర్యాగింగ్, బాల కార్మిక చట్టం, వాహనాల చట్టాల‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో పాటు కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.