2 July, 2026 | 12:02 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ

26-09-2024 03:42 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సాయుధ పోరాట కాలంలోనే తన అక్కుల సాధన కోసం చట్టం పరిధిలో కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామిక వాది చిట్యాల ఐలమ్మ అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ స్వాతంత్ర ఉద్యమ సమరయోధులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని వారి ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి ఏ.ఆర్.డి.ఎస్.పి యాకూబ్ రెడ్డి రిజర్వ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఎస్ బి ఇన్స్పెక్టర్ జార్జ్ ఆర్ఎస్ఐలు డిపిఓ కార్యాలయ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.