2 July, 2026 | 10:54 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

అంగన్వాడి కేంద్రంలోనే పౌష్టికాహారం తినాలి

26-09-2024 03:37 PM

ఏసిడిపిఓ ఛాయాదేవి

సిద్దిపేట,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని కేంద్రంలోనే తినాలని ఏసీడీపీఓ ఛాయాదేవి అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని ఇంద్రానగర్ ఐసిడిఎస్ సెక్టార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టిక మాసోత్సవాలలో భాగంగా అన్నప్రాశన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ ఛాయాదేవి మాట్లాడుతూ... గర్భిణీ, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ సమీపంలోని అంగన్వాడి కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా పొందాలన్నారు. ప్రతి నెల పిల్లలను బరువులు తీయాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా ఇప్పించాలన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.  మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పిల్లల్ని కేంద్రానికి పంపించాలని, కూరగాయలు, పండ్లు, పప్పు క్రమం తప్పకుండా పొందాలని చెప్పారు. ఆకుకూరలు తినడం వల్ల అవసరమైన క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం లభిస్తుందన్నారు.

పుట్టిన గంటలోపు శిశువుకు ముర్రుపాలు తాగించాలని చెప్పారు. అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించే పౌష్టిక మాసోత్సవాలలో గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పాల్గొని తగిన సూచనలు, సలహాలు పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆలకుంట కవిత, సూపర్వైజర్ స్వప్న,  అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.