10 July, 2026 | 5:39 AM

చేగుంట పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ

26-06-2025 01:16 AM

చేగుంట, జూన్ 25 : చేగుంట పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించారు. చేగుంట ఎస్త్స్ర శ్రీ చైతన్య కుమార్ రెడ్డి  పూల బొకేతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఉన్న పలు రికార్డులను, తనిఖీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్, రామయంపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజా గౌడ్, ఎస్‌ఐ 2  బిక్య నాయక్, ఏఎస్‌ఐ సమీయుద్దీన్, సిబ్బందిపాల్గొన్నారు.