మర్యాదగా మాట్లాడు
మీకు ప్రతిపక్ష హోదా కూడా మిగలదు
హరీశ్‌రావుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఆన్ రికార్డు ఓ శాసన సభ్యుడిని యూజ్‌లెస్ ఫెలో అంటూ ఎలా అంటారని హరీశ్‌రావుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిండుసభలో హరీశ్‌రావు వ్యాఖ్యలు సరికాదని.. ఆ మాటలను ప్రజలంతా వింటు న్నారన్నారు. మర్యాదగా మాట్లాడకపోతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని హితవు పలికారు. సభపై ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.
తెలంగా ణను అప్పులపాలు చేసింది మీరేనని.. దొంగతనం చేసి రాష్ట్రాన్ని దోచుకుతిన్నా రు కాబట్టే దొంగ అంటారని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. దొంగే దొంగా దొంగా అన్నట్టు హరీశ్‌రావు తీరు ఉందని ఎద్దేవాచేశారు. క్షమాపణ చెప్పకపోతే సభను నడవనివ్వమని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నేతల తీరుకు తాము భయపడబోమని ఉద్ఘాటించారు. కాగా, హరీశ్‌రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దొంగ అన్న పదం తనకు వినపడలేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఎవరు అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేసినా తొలగించాల్సిందేనని స్పష్టంచేశారు.






