30 August, 2026 | 8:58 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

యూజ్‌లెస్ ఫెలో!

20-12-2024 02:09 AM

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం

తనను దొంగ అన్నారని మండిపాటు

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర రుణాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య వాడివేడిగా మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతున్న సమయంలో సభలో ఎవరో తనను దొంగ అన్నారంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎవడ్రా యూజ్‌లెస్ ఫెలో? అంటూ మండిపడ్డారు. రికార్డుల నుంచి ఆ మాట తొలగిస్తారా? లేదా? అని అడిగారు.

తనను దొంగ అన్న వారు వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే తాను కూడా తన మాటను వెనక్కి తీసుకుంటానని హరీశ్‌రావు స్పష్టంచేశారు. తననో సభ్యుడు దొంగ అని అన్నప్పుడే తాను యూజ్‌లెస్ ఫెలో అనాల్సి వచ్చిందని.. దీన్ని మీరు సమర్థిస్తారా అంటూ మంత్రి శ్రీధర్ బాబును ప్రశ్నించారు. దొంగ అన్న పదాన్ని తొలగించినప్పుడే యూజ్‌లెస్‌ఫెలో అన్న పదాన్ని తొలిగించాలని అన్నారు. ‘రాజగోపాల్ రెడ్డి.. మీరు హోంమంత్రి అయ్యాక మైక్ ఇస్తారు.. ఇప్పుడు కూర్చోవాలి’ అంటూ హరీశ్‌రావు అన్నారు.