27 February, 2026 | 9:36 AM

అనర్హత పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్న సభాపతి

17-12-2025 08:46 AM

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఐదు మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తీర్పు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు తెల్లాం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం తెలిపింది. శాసనసభ వెబ్ సైట్ లో తీర్పు ప్రతులను అధికారులు  అప్ లోడ్ చేయనున్నారు.

ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోకా తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు గురువారంతో ముగుస్తుంది. పది మంది ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ శాసనసభ సభాపతి(Telangana Legislative Assembly Speaker) ఎలాంటి విచారణ జరుపకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.