calender_icon.png 17 December, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి దశ పంచాయతీ ఎన్నికలు.. 23.52 పోలింగ్ నమోదు

17-12-2025 10:43:11 AM

హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 12,652 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా, 75,725 మంది వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. 36,483 పోలింగ్ కేంద్రాలలో జరిగే ఈ ఎన్నికలలో ఏకంగా 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు.

ఉదయం 7 గంటల నుంచి 9 గంట వరకు 23.52 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, మాసబ్ ట్యాంకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో డ్యాష్ బోర్డ్ ద్వారా ఓటింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిణి రాణి కుముదిని పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ఎన్నికల పరిశీలకలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ విధానాన్ని వీక్షిస్తున్న రాణి కుముదిని జిల్లాల మైక్రో అబ్జర్వర్లతో మాట్లాడుతున్నారు.