9 April, 2026 | 2:00 AM

వెలుగుమట్ల బాధితులందరికీ కూల్చిన చోటనే ఇళ్లు కట్టించాలి

09-04-2026 12:06 AM

బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలి

సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజాధర్నాలో వక్తల డిమాండ్

ముషీరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): వెలుగుమట్లలోని బాధితులందరికీ ఇల్లు కూల్చిన చోటనే కట్టించాలని పలువురు వక్త లు డిమాండ్ చేశారు. బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించి, అక్రమ కేసులు అన్నింటిని ఎత్తివేయాలన్నారు.

ఖమ్మం జిల్లా  వెలుగుమట్లలో ప్రభుత్వం గత నెల లో కూల్చిన చోటనే అందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాం డ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రజాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య అధ్యక్షత వహించిన ఈ ప్రజాధర్నాను సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ. చలపతి రావు ప్రారంభిస్తూ వెలుగుమట్లలో కొంతమందికి ఇల్లు కట్టించి సమస్య అయిపోయిందని చేతులు దులుపుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం అన్యాయమైందన్నారు.

ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర నాయకులు బండారు రవి కుమార్, సీపీఐ రాష్ట్ర నాయకులు బోస్, ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి ఎంసిపిఐ యు రాష్ట్ర నాయకులు వరి కుప్పల వెంకటన్న,  సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాజా రమేష్, జర్నలిస్టు మన తొలి వెలుగు రఘు, కాళోజి టీవీ దాసరి శ్రీనివాస్,  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి, వర్గం సభ్యులు ఎస్.  వెంకటేశ్వరరావు, ఆవూరినూరి మధు, గోవర్ధన్, వి. సంధ్య జి. ఝాన్సీ, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జతిన్ కుమార్,  ప్రధాన కార్యదర్శి విజయ్, పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు పి. మహేష్, ఏఐఎఫ్టి యు రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్, మూసి బచావో నాయకులు మంజుల తదితరులు పాల్గొన్నారు.