ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
జీవితంలోని ప్రతి దశలో మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముందస్తు పరీక్షలు, స్క్రీనింగ్‌లతో అనేక వ్యాధులను నివారించవచ్చునని- కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైద్యులు మహిళలు జీవితంలోని ప్రతి దశలో తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు.
భారతదేశంలో మహిళలు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి లక్ష ప్రసవాలకు సుమారు 97 మంది మహిళలు ప్రసవ సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు.
ఇది గర్భధారణ, ప్రసవ సమయంలో ఇంకా జాగ్రత్తలు అవసరమని సూచిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారత్‌లో 15 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో 57 శాతం మందికి పైగా రక్తహీనత (అనీమియా) సమస్య ఉంది. నియమిత ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలు వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెప్పారు.
నియమిత ఆరోగ్య పరీక్షలు
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి అండ్ గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ ముత్తినేని రజిని మాట్లాడుతూ.. మహిళలు “నియమిత ఆరోగ్య పరీక్షలు, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్, గైనకాలజీ పరీక్షలు చాలా ముఖ్యం. భారత్‌దీతిజిజిలో అనీమియా, థైరాయిడ్ సమస్యలు, సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇవి చాలా సందర్భాల్లో ఆలస్యంగా గుర్తించబడుతున్నాయి. ప్రతి మహిళకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉండాలి” అని ఆమె తెలిపారు.
హార్మోన్ మార్పులు
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ సీనియర్ కన్సల్టెంట్ హైరిస్క్ ప్రసూతి అండ్ గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ క్రాంతి శిల్ప మాట్లాడుతూ.. మహిళలు జీవితంలో ఎన్నో హార్మోన్ మార్పులను ఎదుర్కొంటారని చెప్పారు. “నెలసరి లోపాలు, పెల్విక్ నొప్పి, అలసట, మానసిక మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే ఈ సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు,” అని ఆమె చెప్పారు.
మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ సమస్యలపై కేర్ హాస్పిటల్స్ సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సతీష్ పవార్ మాట్లాడుతూ.. భారత్‌లో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా గుర్తించబడుతున్న క్యాన్సర్‌గా మారింది అని తెలిపారు. అలాగే సర్వికల్ క్యాన్సర్ కూడా మహిళలలో మరణాలకు ప్రధాన కారణంగా కొనసాగుతోందని చెప్పారు.
“సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ క్యాన్సర్లలో చాలా వరకు ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామోగ్రఫీ, పాప్ స్మియర్ పరీక్షలు, హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి అవగాహన పెరగడం వల్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు,” అని ఆయన అన్నారు.




