15 June, 2026 | 7:57 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి

26-03-2026 12:08 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

నూతనకల్, మార్చి 25: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని శిల్పకుంట్ల గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంటును ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాలేరు నుండి వస్తున్న నీటి సరఫరా తీరును నిశితంగా పరిశీలించారు. ప్లాంటుకు అందుతున్న నీటి పరిమాణం, సరఫరా అవుతున్న విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ప్లాంటులోని ల్యాబ్ను సందర్శించి, నీటి నాణ్యతను ఎలా నిర్ధారిస్తున్నారో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.ప్లాంటులో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో నీటి సరఫరాలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.అనంతరం కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టి , ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు.